6 సరికొత్త రైల్వే కారిడార్ల గుర్తింపు
Posted On January 30, 2020
*దేశవ్యాప్తంగా వేగవంతమైన పలు రైల్వే కారిడార్లను రైల్వేబోర్డు గుర్తించింది.
*హైదరాద్-పూణే-ముంబాయి (711 కెఎం), ముంబయి-నాసిక్-నాగపూర్ (753), చెన్నై-బెంగళూరు-మైసూరు (435), ఢిల్లీ-చండీగడ్-లుధియానా-జలంధర్-అమృత్‌సర్ (459), ఢిల్లీ-నోయిడా-ఆగ్రా-లక్నో-వారణాసి (865), ఢిల్లీ-జైపూర్-ఉదయ్‌పూర్-అహ్మదాబాద్(886) రూట్లలో హై స్పీకర్ రైళ్లను నడిపించేందుకు సంబంధించిన డి.పి.ఆర్ (డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) ఒక సంవత్సరంలో పూర్తి చేయనున్నారు.
* ఆరు హై స్పీడ్ రైల్వే కారిడార్లను ముంబాయి-అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న హై స్పీడ్ బుల్లెట్ ట్రేన్ రూట్‌తో అనుసంధానం చేస్తారు.
* హైస్పీడ్ రైల్వే కారిడార్లలో రైళ్లు గంటకు మూడు వందల కిలో మీటర్ల వేగంతో నడుస్తాయి.సెమీ హై స్పీడ్ కారిడార్లలో రైళ్లు గంటకు 160 లేదా అంతకంటే ఎక్కువ వేగంతో నడుస్తాయి.
*భూమి లభ్యత, అమరిక, ప్రయాణికుల రద్దీ అంచనాలను అధ్యయనం చేసిన అనంతరం ఈ మార్గాల్లో హై స్పీడ్ రైళ్లను నడిపించడం అనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు.
*ముంబయి-అహమదామాద్ మధ్య నిర్మిస్తున్న హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ పనులు 2023 డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నారు.