దాడుల్లో కేంద్ర సహాయానికి ఆధార్ తప్పనిసరి
Posted On January 19, 2020
*ఉగ్ర దాడులు, మతకలహాల్లో గాయపడిన వ్యక్తులు లేదా వారి కుటుంబీకులకు కేంద్ర ప్రభుత్వం అందించే పథకం నుంచి ఆర్థిక సాయం పొందాలంటే ఆధార్ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
*ఉగ్ర దాడిలో గాయపడిన వారు లేదా వారి కుటుంబీకులు, నక్సల్ దాడి బాధితులు, మతకలహాలల బాధితులు, భారత సరిహద్దుల్లో కాల్పులు, పేలుళ్ల బాధితులు భారత ప్రభుత్వం అందించే పథకానికి అర్హులవ్వాలంటే తప్పనిసరిగా తమ ఆధార్ గుర్తింపును తెలియపరచాలి.
*ఈ పథకం కింద అర్హులైన వ్యక్తులకు ఆధార్ గుర్తింపు సంఖ్య లేకపోతే వెంటనే దానికి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
*అసోం, మేఘాలయలో తప్ప దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాలకు ఈ నియమం వర్తిస్తుంది.
*ఆ రెండు రాష్ట్రాలలో ఆధార్ నమోదు ఇంకా పూర్తికానందున వాటికి ఈ సూచన వర్తించదు.
* ఈ సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులకు అందజేస్తాయి. వారి నుంచి కేంద్రానికి ప్రతిపాదన అందినప్పుడు రాష్ట్రాలకు కేంద్రం ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది.