జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్ కాంపిటీషన్స్ లో ఆబిద్ కు రెండు స్వర్ణాలు
Posted On May 04, 2019
మధ్యప్రదేశ్‌లో జరిగిన జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్ కాంపిటీషన్స్ (ఎన్‌ఎస్‌సీసీ)లో తెలంగాణ రాష్ట్ర షూటర్ ఆబిద్ అలీ ఖాన్ వ్యక్తిగత విభాగంలో రెండు స్వర్ణాలు, ఒక రజతం ,. టీమ్ విభాగంలో కాంస్యాన్ని సాధించాడు.
*300 మీ. రైఫిల్ ప్రోన్ జూనియర్ పురుషుల నేషనల్ చాంపియన్‌షిప్ వ్యక్తిగత విభాగంలో ఆబిద్ 600 పాయింట్లకు గానూ 587 పాయింట్లు స్కోర్ చేసి విజేతగా నిలిచాడు.
*300 మీ. రైఫిల్ ప్రోన్ జూనియర్ పురుషుల సివిలియన్ చాంపియన్‌షిప్‌లోనూ ఆబిద్ చాంపియన్‌గా నిలిచి మరో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 300 మీ. రైఫిల్ ప్రోన్ పురుషుల సివిలియన్ చాంపియన్‌షిప్‌లో అతను రెండోస్థానంలో నిలిచి రజతాన్ని అందుకున్నాడు.
*300 మీ. రైఫిల్ ప్రోన్ పురుషుల సివిలియన్ చాంపియన్‌షిప్ టీమ్ కేటగిరీలో ఆబిద్ అలీ ఖాన్, శ్యామ్ సుందర్, సయ్యద్ మొహమ్మద్ మహమూద్‌లతో కూడిన తెలంగాణ బృందం మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది.