గర్భస్రావం గడువు పెంచిన కేంద్రం
Posted On January 29, 2020
*మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగెన్సీ(ఎంటీపీ)గా పరిగణించే గర్భస్రావాన్ని 1971 జూన్‌లో చట్టబద్ధం చేశారు.
* ఈ చట్టం ప్రకారం ఐదు నెలలలోపు గర్భం వరకే ఇది పరిమితం. ఐదు నెలల తర్వాత గర్భస్రావ ప్రయత్నం ప్రమాదకరం చట్ట వ్యతిరేక చర్య కిందకి వస్తోంది.
*కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో గర్భం వల్ల తల్లి ప్రాణానికి ప్రమాదమయితే లేదా బిడ్డ సరిగ్గా రూపొందకపోతేనే గర్భస్రావం చేయాలి.
*గర్భిణులు అబార్షన్లు చేయించుకునే కాల పరిమితి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
*కేంద్ర క్యాబినెట్ నిర్ణయానికి ముందు పరిస్థితి -- 20 వారాల వరకు గర్భం ఉన్నవారికి మాత్రమే అబార్షన్లు చేయించుకునే వెసులుబాటు ఉంది.
*కేంద్ర క్యాబినెట్ నూతన నిర్ణయం -- 20 వారాల వరకు గర్భం ఉన్నవారికి మాత్రమే అబార్షన్లు చేయించుకునే వెసులుబాటు పరిస్థితిని 24 వారాలకు పెంచారు.కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్న ప్రకారం,మహిళలు గర్భాన్ని తొలగించుకునే పరిమితిని 24 వారాలకు పెంచడం ద్వారా వారి పునరుత్పత్తి హక్కులను కాపాడటం కిందకి వస్తుంది.
*మొదటి ఐదు నెలల (20 వారాలు) తర్వాత శారీరక ఇబ్బందులు ఎదుర్కొనే గర్భిణులు ఆ తర్వాత అబార్షన్ చేయించుకోవాలంటే కోర్టులకు వెళ్లాల్సి వచ్చేది.
*మైనర్లు,అత్యాచార బాధితులు,కొన్ని విపత్కర పరిస్థితుల్లో గర్భం దాల్చినవాళ్లు మొదటి ఐదు నెలల్లో తాము గర్భం దాల్చామని తెలుసోలేక ఆ తర్వాత అబార్షన్ కోసం కోర్టులకు వెళ్లాల్సి వచ్చేది.
*గతేడాది సెప్టెంబర్ లో...అబార్షన్ కు 20వారాల గడువు ఫిక్స్ చేసిన మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్-1971 సెక్షన్ 3(2) రాజ్యాంగ ప్రామాణికతను సవాల్ చేస్తూ,లిమిట్ ను 26వారాలకు పొడించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై కేంద్రం స్పందిస్తూ...రాష్ట్రం పౌరుల సంరక్షకుడిగా,గర్భంలో ఉన్న పిండం సాధ్యమయ్యే దశకు చేరుకున్న తర్వాత ఆ ప్రాణాన్ని కాపాడటానికి నైతికంగా మరియు విధి కలిగి ఉందని తెలిపింది.
*పుట్టని శిశువు తన తండ్రి,లేదా తల్లి తలపెట్టే హానినుంచి తనను తాను కాపాడుకోలేదని తెలిపింది. చాలా కేసుల్లో పదే పదే... ప్రెగ్నెన్సీని తొలిగించుకోవాలనుకున్న మహిళల కన్నా...మానసిక వేదన,గాయాలతో గర్భం దాల్చాలనుకున్న మహిళల్లో 20వ వారం తర్వాత తీవ్రమైన అసాధారణతలు గుర్తించారు.
*ఈ అంశంపై అధ్యయనం చేయడానికి కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన ఓ మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు.