ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీకి జాతీయ స్థాయి గుర్తింపు
Posted On August 31, 2019జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం(ఈ–నామ్) అమలులో ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీకి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.
దేశంలోని 585 వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఈ–నామ్ అమలు చేస్తున్నారు.
ముఖ్య ఉదేశ్యం -- వ్యాపారుల మధ్య పోటీ తత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు లావాదేవీలను వంద శాతం పారదర్శకంగా నిర్వహించడం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం.
ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న మార్కెట్ కమిటీలకు జాతీయ స్థాయిలో మూడు అవార్డులు ఇస్తారు.
త్తరాది, దక్షిణాది రాష్ట్రాల కేటగిరీలో ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పోటీ పడుతోంది.
ఆదోని మార్కెట్‌యార్డులో ప్రస్తుతం లావాదేవీలన్నీ ఈ–నామ్ పోర్టల్ ద్వారానే నిర్వహిస్తున్నారు.
కర్నూలు, ఎమ్మిగనూరు మార్కెట్లతో పాటు వివిధ జిల్లాల్లోని మార్కెట్లతో పోల్చితే ఆదోనిలో రైతులకు ఎక్కువ ధరలే లభిస్తున్నాయి.
మార్కెట్‌యార్డు మొత్తానికి మార్కెటింగ్ శాఖ ఫ్రీ ఇంటర్నెట్ వైఫై సౌకర్యం కలదు.
దేశంలో 585 మార్కెట్‌లు ఉండగా.. జాతీయ అవార్డు కోసం 200 దాకా పోటీ పడ్డాయి.