అఫ్ఘాన్ క్రికెటర్ షఫీకుల్లాపై ఆరేళ్ల నిషేధం
Posted On May 12, 2020
అవినీతి కార్యకలాపాలకు పాల్పడినందుకుగాను ఆఫ్గానిస్థాన్ క్రికెటర్ షఫీఖుల్లా షఫాక్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు ఆరేళ్ల పాటు నిషేదించింది. ఆఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్ టీ20 2018 ఎడిషన్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2019 ఎడిషన్‌లలో కరెప్షన్ చేసినట్లు అంగీకరించడంతో తాజాగా అతనిపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. ఆటగాళ్ల ప్రవర్తన నియమావళిలోని నిబంధన 2.1.1ను అతను ఉల్లంఘించినట్లు తేల్చిన బోర్డు.. ఈ మేరకు చర్యలు తీసుకుంది. 30 ఏళ్ల షఫీకుల్లా అఫ్ఘాన్ జాతీయ జట్టు తరఫున 24 వన్డేలు, 46 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు.