అజయ్ తిర్కీ WCD మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియామకం
Posted On May 02, 2020
అజయ్ తిర్కీ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అజయ్ తిర్కీ మధ్యప్రదేశ్ కేడర్ నుండి 1987 బ్యాచ్ ఐఎఎస్ అధికారి.
అతను ఏప్రిల్ 30న పదవీ విరమణ చేసిన రవీంద్ర పన్వర్ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. అజయ్ తిర్కే అంతకు ముందు మంత్రిత్వ శాఖలో ప్రత్యేక కార్యదర్శి మరియు అదనపు కార్యదర్శిగా పనిచేశారు.
గతంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగంలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. రక్షణ మంత్రిత్వ శాఖలో 2004 నుండి 2009 వరకు డైరెక్టర్ మరియు జాయింట్ సెక్రటరీగా కూడా పనిచేశారు.