ఆంధ్రప్రదేశ్ రాజధాని పై బోస్టన్ కమిటీ నివేదిక
Posted On January 04, 2020
*రాజధాని నిర్మాణం కోసం వనరులు మౌలిక వసతుల పై అధ్యయనం చేయడం కోసం జిఎన్ రావు కమిటీని గతంలో నియమించారు.
*జిఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 3 రాజధానిల ప్రకటనను సమర్థిస్తూ ఉంది.
* రాష్ట్రంలో రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై సాంకేతికంగా విశ్లేషణ చేసేందుకు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ను ప్రభుత్వం నియమించింది.
*రాజధానిలోని అన్ని జిల్లాలలో అధ్యయనం చేసిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది.
*బోస్టన్ కమిటీ నివేదికలోని అంశాలు--
1.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి అమరావతి అభివృద్ధి సంక్లిష్టమైనది బోస్టన్ కమిటీ వెల్లడించింది. అమరావతిలో కొత్తగా టేక్ అప్ చేసి సిటీలకు నాలుగు నుంచి 4.5 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని ఈ నివేదికలో తెలిపింది.
2.32 గ్రీన్ఫీల్డ్ సిటీ లను పరిగణనలోకి తీసుకొని అధ్యయనం చేసినట్టు బోస్టన్ కమిటీ నివేదికలో వెల్లడించింది.
3.అమరావతి భూముల అమ్మకం ద్వారా వచ్చే నిధులు సరిపోవు,అమరావతి నిర్మాణానికి రుణం తెస్తే ప్రతి సంవత్సరం 10వేల కోట్ల రూపాయల వడ్డీ కట్టాలి.
4. అమరావతికి గతంలో వరదలు వచ్చిన నేపథ్యంలో అక్కడ నిర్మాణాలు ప్రమాదకరం.
5.విశాఖలో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి.15 లక్షల మంది జనాభా అక్కడ ఉన్నారు.విజయవాడలాంటి చోట్ల మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్నాయి.బీసీజీ విశాఖ, విజయవాడ, కర్నూలును ప్రధానంగా భావించి దృష్టి సారించాలి. విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్ సహా ఏడు కీలక విభాగాలు ఉండవచ్చు.
6.అత్యవసర సమావేశాల కోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ విశాఖలో ఉండవచ్చు. అప్పిలేట్ అథారిటీలు, హైకోర్టు కర్నూలులో ఉండాలి.
7.ఎడ్యుకేషన్ విషయంలో విజయవాడకు, టూరిజం విషయంలో విశాఖకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. 40 సంవత్సరాలలో ఒక నగరంపై లక్ష కోట్ల రూపాయలు పెడితే అభివృద్ధి చెందే అవకాశం ఉందని కానీ ప్రస్తుతం లక్ష కోట్ల రూపాయలు పెట్టే పరిస్థితిలో ఏపీ లేదు.
8.13 జిల్లాలను ఆరు ప్రాంతాలుగా విభజించి ఆరు ప్రాంతాలలో వనరులను, అభివృద్ధికి ఆటంకాలను, సమస్యలకు పరిష్కారాలను కమిటీ పరిశీలించింది.
9.వాటర్ గ్రిడ్, రోడ్ గ్రిడ్, బ్యాక్ వాటర్ టూరిజంతో పాటు పోలవరం, ప్లాస్టిక్ మరియు గ్యాస్ రంగాల్లో పరిశ్రమలు గోదావరి డెల్టాలో అభివృద్ధి చేయవచ్చు. మైపాడు, మచిలీపట్నం బీచ్ లను అభివృద్ధి చేయాలి.
10. టమాటా పంటకు కోల్డ్ స్టోరేజీలు చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని ఎలక్ట్రానిక్ పరిశ్రమలు తిరుపతిలో ప్రోత్సహించాలి.
11.ఆటోమొబైల్ లాజిస్టిక్ హబ్ కు కర్నూలు - అనంతపురం ప్రాంతంలో ఉండవచ్చు. రాష్ట్రానికి ప్రకృతి సంపద ఉన్నప్పటికీ సరిగా వినియోగించుకోవటం లేదు. 8 జిల్లాల్లో పారిశ్రామిక వృద్ధి చాలా తక్కువగా ఉంది.