అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే
Posted On November 26, 2019
*కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ --అనంతపురం-అమరావతి యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం ఖరారు చేశారు.
* 384 కిలోమీటర్ల పొడవు అలైన్‌మెంట్‌తో ఈ రహదారి నిర్మించనున్నారు.
* భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా గ్రాండ్ చాలెంజ్ కింద కొత్తగా రహదారి ప్రాజెక్ట్‌లు చేపట్టవలసిందిగా రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి.
* అలాంటి ప్రాజెక్ట్‌ల్లో భూసేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించడానికి ఆయా రాష్ట్రాలు ముందుకు వస్తే మిగిలిన వ్యయంతోపాటు ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని కూడా కేంద్రమే భరిస్తుంది.
* భూసేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
* ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పర్యావరణ, అటవీ, వన్యప్రాణుల శాఖల నుంచి చట్టబద్దమైన అనుమతులు తీసుకునే చర్యలను పూర్తి చేయనున్నారు.
* అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేను 12 ప్యాకేజీల కింద చేపట్టేలా సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లో గతంలో పేర్కొన్నారు.