హోమ్ డెలివరీ పెన్షన్
Posted On January 29, 2020
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 54 లక్షల మంది పేదలకు ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఇంటివద్దే పింఛన్లు పంపిణీ చేయనున్నారు.
*ఎన్నికలకు ముందు రాష్ట్రంలో 39 లక్షల మంది మాత్రమే పింఛన్లకు అర్హులుగా ఉండగా,ఇప్పుడు 54.64 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వనున్నారు.
*15.64 లక్షల మందికి కొత్తగా ప్రయోజనం కలగనుంది.
* గ్రామ, వార్డ్ వాలంటీర్లు పెన్షన్ సొమ్మును అర్హుల ఇంటి దగ్గరకు వచ్చి పంపిణీ చేస్తారు.
*స్పందన కార్యక్రమంలో ఎక్కువగా పెన్షన్లు, ఇళ్లు, రేషన్ కార్డులకు సంబంధించిన ఫిర్యాదులే రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
*ఫిబ్రవరి 15వ తేదీ నుండి ఫిబ్రవరి 21వ తేదీ వరకు కొత్తగా రేషన్ కార్డులకు, పెన్షన్ కు అర్హులైన వారికి రేషన్, పెన్షన్ కార్డులను అందజేయనున్నారు.
*ఫిబ్రవరి 2వ తేదీలోపు సామాజిక తనిఖీ పూర్తి చేసి వెంటనే కార్డుల పంపిణీ చేపట్టనున్నారు.
*అర్హులెవరైనా మిగిలిపోయి ఉంటే కొత్త కార్డుల మంజూరు గ్రామ సచివాలయాల ద్వారా చేస్తారు.