దేశంలో సూక్ష్మసేద్యం పరికరాల అమరికలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం సాధించింది.
Posted On April 02, 2019*వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి ఉద్యాన పంటలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిందు, తుంపర సేద్య పరికరాలను రైతులకు 90శాతం రాయితీపై అందిస్తోంది.
* రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో నీటికొరత ఎక్కువగా ఉన్నందున ఒక్కో రైతుకు పదెకరాల విస్తీర్ణం వరకు ఈ రాయితీని అందజేస్తోంది. మిగిలిన జిల్లాల్లో 5 ఎకరాల విస్తీర్ణానికి అందిస్తోంది.
* రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం ఒక్క ఏడాదిలోనే రూ.372.36 కోట్లు వెచ్చించింది.
* దేశంలో అనంతపురం జిల్లా అత్యధికంగా 34,122 హెక్టార్లలో సూక్ష్మసేద్య పరికరాల అమరికతో ముందు నిలిచింది. ఇక్కడ నీటిలభ్యత తక్కువగా ఉండటం, భూగర్భజలాలపై ఆధారపడటంతో ఎక్కువమంది రైతులు బిందు, తుంపర్ల సేద్యం పరికరాలు అమర్చుకుంటున్నారు.
*ఇజ్రాయెల్ఈ రకమైన మొదటి ప్రయోగాత్మక వ్యవస్థ 1959 లో స్థాపించబడింది.