అన్నదాతా సుఖీభవ రెండో విడత నిధులు రైతుల ఖాతాల్లో 3 వేలు జమ
Posted On April 04, 2019*ఇప్పుడు మరో రూ.మూడు వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసింది. .
*కిసాన్ సమ్మాన్ కింద కేంద్రం రైతుల కుటుంబాలకు ఏటా రూ.6000 చొప్పున ప్రకటించింది. దీనికి అదనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.9000 చొప్పున(మొత్తం 15000) రైతుల కుటుంబాలకు అందించనుంది.
* ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులు రాష్ట్రంలో 53.45 లక్షలుంటారని ప్రభుత్వ అంచనా.
* ఇప్పటివరకూ రెండు విడతల్లో కలిపి సుమారు రూ.రెండు వేల కోట్లు విడుదల చేసింది.
* ఐదెకరాలకంటే ఎక్కువ సాగు భూమి ఉన్న రైతులకు పీఎం-కిసాన్ పథకం వర్తించనందున వారికి రాష్ట్ర ప్రభుత్వమే అన్నదాతా సుఖీభవ కింద రూ.పది వేల చొప్పున అందజేస్తోంది. .
* రైతుల భూమి ఖాతా వివరాలకు ఆధార్ అనుసంధానమైతేనే వారి ఖాతాకు సొమ్ము జమవుతుంది.