ముందస్తు బెయిలు పై సుప్రీం కోర్ట్
Posted On January 30, 2020
*సుప్రీం కోర్టు అరెస్టు ముప్పు పొంచి ఉందని భావిస్తున్న వ్యక్తులకు ముందస్తు బెయిలు మంజూరుకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.
*ధర్మాసనం --ముందస్తు బెయిలుపై జస్టిస్ అరుణ్ మిశ్ర నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.
*తీర్పు లోని అంశాలు --
హక్కులు ప్రాథమిక మైనవి, ఆంక్షలు వాటంతటి ప్రధానమైనవి కావు.
ముందస్తు బెయిలు కోసం ఒక వ్యక్తికి నేర శిక్షా స్మృతిలోని 438 సెక్షన్ కింద కల్పిస్తున్న ఉపశమనానికి నిర్దిష్ట కాలావధి లేదు.
విచారణ ముగిసే వరకూ బెయిలు వర్తిస్తుంది.
పౌరుల హక్కులు ప్రాథమికమైనవి. ఇతర ఆంక్షల కన్నా అవి సర్వోత్కృష్టమైనవి.
అర్థవంతమైన దర్యాప్తు కోసం కాకుండా శక్తిమంతమైన వ్యక్తుల ప్రయోజనాల కోసం పౌరులపై వివాదాస్పద, దురుసు అరెస్టులకు దిగుతున్న నేపథ్యంలో 438 సెక్షన్‌ను తీసుకువచ్చారు.
* ధర్మాసనంలోని జస్టిస్ ఎస్.రవీంద్ర భట్.. మిగతా న్యాయమూర్తుల వాదనతో ఏకీభవిస్తూనే విడిగా 73 పేజీల తీర్పును వెలువరించారు.