పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా ఆనంద్
Posted On May 12, 2020
పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ (పరిపాలనాధికారి)గా ఐఏఎస్ అధికారి ఒ.ఆనంద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆనంద్ పోలవరం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ పదవిని రద్దు చేసి తాజా బాధ్యతలు అప్పగించింది. ఇప్పటిదాకా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి నిర్వాసితులకు సహాయ, పునరావాసం కల్పించడం, భూసేకరణ అంశాలను ఇప్పటి వరకు ఉభయగోదావరి జిల్లాల జేసీలు చూసేవారు. ప్రాజెక్టుకు స్పెషల్ కలెక్టర్ ఉన్నారు. తాజా ఉత్తర్వులతో ఈ బాధ్యతలన్నీ పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా నియమితులైన ఆనంద్ పర్యవేక్షించనున్నారు. స్పెషల్ కలెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఇ.మురళిని సాధారణ పరిపాలన విభాగానికి ప్రభుత్వం బదిలీ చేసింది.