అరకువ్యాలీ సేంద్రీయ కాఫీ - ఉత్తర, ఈశాన్య భారతానికి వ్యాప్తి
Posted On September 14, 2019
*అరకువ్యాలీ సేంద్రీయ కాఫీ ఉత్తర, ఈశాన్య భారతానికి వ్యాప్తిచెందిన చేయడానికి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ప్రణాళిక రూపొందించింది.ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో అమ్మకాల విస్తరణపైనే జీసీసీ ఎక్కువ దృష్టి సారించింది.
*కార్పొరేట్ తరహాలో వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు. కాఫీ సాగులేని ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల మార్కెట్‌పై దృష్టి. ఈ ప్రాంతాలకు ప్రస్తుతం కర్ణాటక నుంచే కాఫీ ఎగుమతి అవుతోంది.
*అక్కడి కాఫీ సాగులో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు ఎక్కువగా వాడుతున్నారు.
*కానీ అరకువ్యాలీ కాఫీ పూర్తిగా సేంద్రీయ విధానంలోనే సాగు అవుతోంది. దీనికి బాగా ఆదరణ లభిస్తోంది.
*దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద జీసీసీ ఇప్పటికే కాఫీ షాప్‌ను ఏర్పాటు చేసి కాఫీని విక్రయిస్తోంది. ఇకపై వివిధ రకాల సేంద్రీయ అటవీ ఉత్పత్తుల అమ్మకానికి కార్పొరేట్ స్థాయిలో విక్రయశాలను ఏపీ భవన్ ప్రాంగణంలోనే ఏర్పాటు చేయనుంది. *అలాగే జీసీసీ ఉత్పత్తులను మార్కెటింగ్‌కు వీలుగా న్యూఢిల్లీలోని పూసా వద్ద ఒక గోదాంను కేటాయించడానికి ట్రైబల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ట్రైఫెడ్) సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇక విమానాశ్రయాల్లో, రైల్వేస్టేషన్లలో జీసీసీ ఉత్పత్తుల విక్రయశాలలు, కాఫీ షాప్‌ల ఏర్పాటుకు అనుమతి
కోరారు.
*విశాఖ జిల్లాలోని మన్యంలో ప్రస్తుతం 1.50 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు ఉన్నప్పటికీ 70 వేల ఎకరాల్లో ఏటా 8 వేల నుంచి పది వేల టన్నుల వరకూ కాఫీ గింజల దిగుబడి వస్తోంది. సముద్రమట్టానికి 1,500 నుంచి మూడు వేల మీటర్ల ఎత్తున ఉన్న మన్యంలో సారవంతమైన ఏటవాలు ప్రాంతమంతా కాఫీ సాగుకు అనుకూలంగా ఉంది.