ఆత్మ నిర్భర్ పేరుతో 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం
Posted On May 14, 2020
ఆత్మ నిర్భర్ భారత్.. ప్రధాని మోదీ ఈ పేరుతోనే రూ.20 లక్షల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’పథకానికి రూపకల్పన చేసింది. భారత ఆర్థిక వ్యవస్థలోని అన్ని వర్గాలను ఆదుకునే ప్రణాళికతో ఒక భారీ ఆర్థిక ప్యాకేజీని మే 12న ప్రధాని మోదీ ప్రకటించారు.
5 మూల సూత్రాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్రకటన చేశారు. అవి ఆర్థిక వ్యవస్థ (Economy), మౌలిక సదుపాయాలు (Infrastructure), సాంకేతికత (Technology driven system), జనాభా (Demography), గిరాకీ (Demand). భారత్ ఎవరిపైనా ఆధారపడకుండా.. స్వయం ఆధారితంగా ఎదగడమే ఈ ప్యాకేజీ ఉద్దేశ్యమని అన్నారు.