ఆస్ట్రియా యువరాణి మరియా మృతి
Posted On May 16, 2020
ఆస్ట్రియా యువరాణి మరియా గాలిట్జీన్ (31) ఆకస్మికంగా గుండెపోటు రావడంతో హ్యూస్టన్‌లో మే 4న కన్నుమూశారు. 2017లో హ్యూస్టన్‌లో భారత సంతతికి చెందిన చెఫ్ రిషి రూప్ సింగ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడు మాక్సిమ్ ఉన్నాడు. 1988లో రష్యన్ ప్రిన్స్ పియోటర్ గాలిట్జీన్, ఆస్ట్రియాకు చెందిన ఆర్కిడ్యూస్ మరియా అన్నా దంపతులకు జన్మించారు. బెల్జియంలోని కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ స్కూళ్లో చదివారు. మరియా ఇంటీరియర్ డిజైన్, ఫర్నిషింగ్‌లో నైపుణ్యం సాధించిన ఆమె బ్రస్సెల్స్, చికాగో, హ్యూస్టన్ సిటీలలో పనిచేశారు.