అయోధ్య ట్రస్ట్
Posted On November 12, 2019
*అయోధ్యలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రామమందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలను కేంద్రం ప్రారంభించింది.
*ట్రస్ట్ ఏర్పాటు చేసేందుకు, సభ్యుల నియామకంతో పాటు విధి విధానాలను నిర్ధారించేందుకు సుప్రీంకోర్టు తీర్పును ఒక అధికారుల బృందం అధ్యయనం చేస్తోంది.
*న్యాయ శాఖ, అటార్నీ జనరల్ సలహాలను తీసుకోనున్నారు.
* ‘ట్రస్ట్ ఏర్పాటుకు సంబంధించిన కీలక విధివిధానాలను రూపొందించేందుకు ఒక అధికారుల బృందం ఏర్పాటైంది.
*ఆ ట్రస్ట్‌కు నోడల్ కేంద్రంగా హోం శాఖ వ్యవహరిస్తుందా? లేక కేంద్ర సాంస్కృతిక శాఖ వ్యవహరిస్తుందా? అనే విషయంలోనూ స్పష్టత లేదు.
*అయోధ్యలోని వివాదాస్పద స్థలంలోనే రామమందిర నిర్మాణం జరగాలని, అందుకు ఒక ట్రస్ట్‌ను కేంద్రం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది.
*మందిర నిర్మాణం, సంబంధిత కార్యక్రమాల నిర్వహణ,మొదలైన అధికారాలు ట్రస్ట్‌కు ఉంటాయి.