రూ.68 వేల కోట్ల రుణాలు రద్దు
Posted On April 30, 2020
దేశంలోని అగ్రగామి 50 మంది ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదార్లకు చెందిన రూ.68,607 కోట్ల రుణాలను సాంకేతికంగా రద్దు(రైటాఫ్) చేసినట్లు ఆర్‌బీఐ తెలిపింది.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని వాటిని తిరిగి చెల్లించని టాప్ 50 రుణ ఎగవేతదారుల రుణాలను టెక్నికల్‌గా రైటాఫ్ చేసిందనే అంశం సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) కింద అడిగిన ప్రశ్నకు ఆ మేరకు సమాధానం ఇచ్చింది. సెప్టెంబరు 30, 2019 వరకు సాంకేతికంగా ఈ రుణాలను రద్దు చేసినట్లు అందులో వివరించింది. రూ.5,492 కోట్లతో మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ (పరారీలో ఉన్న చోక్సీకి చెందిన సంస్థ) అత్యధికంగా రూ. 5,492 కోట్ల బాకీలు చెల్లించాల్సి ఉంది. చోక్సీకే చెందిన గిలి ఇండియా, నక్షత్ర బ్రాండ్స్‌కు చెందిన రుణాలు రైటాఫ్ అయిన జాబితాలో ఉన్నాయి. ఇక మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్(రూ.1943 కోట్లు) రుణాన్ని సైతం బ్యాంకులు సాంకేతికంగా రద్దు చేశాయి.
టాప్–10ఎగవేతదారులు..
సంస్థ రూ. కోట్లలో
- గీతాంజలి జెమ్స్ 5,492
- ఆర్‌ఈఐ ఆగ్రో 4,314
- విన్‌సమ్ డైమండ్స్ 4,076
- రోటోమాక్ గ్లోబల్ 2,950
- కుడోస్ కెమీ 2,326
- రుచి సోయా 2,212
- జూమ్ డెవలపర్స్ 2,012
- కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 1,943
- ఫరెవర్ ప్రెషియస్ 1,962
- డెక్కన్ క్రానికల్ 1,915