దాద్రా-నాగర్ హవేలీ- దమణ్ దీవ్ ,ఎస్పీజీ బిల్లులకు లోక్ సభ ఆమోదం
Posted On November 28, 2019
1.దాద్రా-నాగర్ హవేలీ, దమణ్ దీవ్ కేంద్ర పాలిత ప్రాంతాల విలీనానికి ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది.
*ఈ రెండింటినీ కలిపి ''దాద్రా-నాగర్ హవేలీ- దమణ్ దీవ్'' కేంద్ర పాలిత ప్రాంతంగా వ్యవహరిస్తారు.
* జనాభా, భూ విస్తీర్ణం పరిమితంగానే ఉండటం వల్ల వీటిని విలీనం చేసి అధికారుల సేవలు మరింత సమర్థంగా ఉపయోగించుకునే లక్ష్యంతో బిల్లు ఆమోదించారు.
*స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సవరణ బిల్లు--
2.*కాంగ్రెస్, ఇతర విపక్షాల నిరసనల మధ్య స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది.
*ఈ సవరణ బిల్లు ప్రకారం ఇకపై ప్రధానమంత్రి, ఆయన కుటుంబ సభ్యులకు ఎస్పీజీ కమాండోల రక్షణ ఉంటుంది. మాజీ ప్రధానులు, వారితో పాటు ఒకే ఇంట్లో నివాసం ఉండే కుటుంబసభ్యులకు ఆ ప్రధాని పదవీ కాలం ముగిసిన అయిదేళ్ల వరకు ఎస్పీజీ రక్షణ కల్పిస్తారు.
*బ్లాక్ క్యాట్ కమాండోలు ఉదాసీనంగా వ్యవహరించకుండా, వారి సమర్థత పెంచడం కోసమే ఎస్పీజీ చట్టానికి సవరణలు చేసినట్టు కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారు.
* కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె పిల్లలు రాహుల్, ప్రియాంకలకు భద్రతను ఎస్పీజీ నుండి జెడ్ ప్లస్ కేటగిరీకి మార్చారు.