గగనతల రక్షణ కమాండ్ ఏర్పాటుకు నిర్ణయం
Posted On January 03, 2020
*త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ తన తొలి నిర్ణయాన్ని తీసుకున్నారు.
*నింగిలో భద్రతను బలోపేతం చేయడానికి గగనతల రక్షణ కమాండ్‌ను ఏర్పాటు చేయడానికి జూన్ 30లోగా మార్గసూచీని తయారుచేయాలని ఆదేశాలిచ్చారు.
*డిసెంబర్ 31 కల్లా పలు లక్ష్యాలకు సంబంధించి ప్రాధాన్యతలను నిర్దేశించారు.
* సైన్యం, వాయుసేన, నౌకాదళ సిబ్బందితో కూడిన సమీకృత రక్షణ విభాగం (ఐడీఎస్)లోని వివిధ విభాగాల అధిపతులతో సమావేశం నిర్వహించారు.