నీలికాంతి (బ్లూలైట్) థెరపీ ద్వారా సూపర్‌బగ్ ఇన్‌ఫెక్షన్లను నివారించవచ్చుః అమెరికా శాస్త్రవేత్తలు
Posted On April 04, 2019
* వీటిని ఎదురుకునే అందుకు యాంటీబయాటిక్స్‌ను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు రకరకాల పరిశోధనలు చేస్తున్నారు.
* నీలికాంతి (బ్లూలైట్) థెరపీ ద్వారా సూపర్‌బగ్ ఇన్‌ఫెక్షన్లను నివారించవచ్చని అమెరికాలోని పర్డ్యూ యూనివర్సిటీ, బోస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.
*మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టాఫిలోకాకస్ అరియ్‌స(ఎంఆర్‌ఎ్‌సఏ) అనే సూపర్‌బగ్ ఇన్‌ఫెక్షన్ కారణంగా అయిన ఉపరితల గాయాలను నయం చేసేందుకు బ్లూలైట్ థెరపీ దోహదం చేసిందని పరిశోధకులు వెల్లడించారు.
- సూపర్‌బగ్:
*యాంటీబయాటిక్స్‌ను తయారు చేసే ఫార్మా కంపెనీల కాలుష్య ఫలితమే ఈ సూపర్ బగ్స్ వ్యాప్తికి మూలమని జర్మనీకి చెందిన లీప్‌జిగ్ శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడయింది.
ప్రతి సంవత్సరం మనదేశంలో సూపర్‌బగ్‌వల్ల దాదాపు 58వేలమంది పసిపిల్లలు మృత్యువాత పడుతున్నారు.
*దేశంలో రోజూ 70వేల మంది శిశువ్ఞలు జన్మి స్తున్నారు. ఈ పసికందులకు వచ్చే 80 శాతం అంటువ్యాధులు శక్తివంతమైన క్రిమినాశక ఔషధాలను కూడా తట్టుకోగలుగుతాయి. అయితే 2050 నాటికి సూపర్‌బగ్‌లు కోటి మంది ప్రాణాలను బలిగొంటాయని ఓ పరిశీలనలో వెల్లడైంది.
*క్యాన్సర్ మహ మ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికంటే సూపర్‌బగ్ వల్ల మృతి చెందిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది.
Purdue University:
- Established May 6, 1869
- Founder John Purdue