బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇకలేరు
Posted On May 01, 2020
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (54) గత కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆయన.. ఏప్రిల్ 29న ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కన్నుమూశారు.
రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలోని టోంక్ గ్రామంలో 1967, జనవరి 7న జన్మించిన ఇర్ఫాన్ ఖాన్, హిందీతో పాటు హాలీవుడ్, దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, ఎ మైటీ హార్ట్, జురాసిక్ వరల్డ్, లైఫ్ ఆఫ్ పై వంటి హాలీవుడ్ ఉత్తమ చిత్రాల్లోనూ నటించి మంచి పేరును సంపాదించారు. ఈయన మొదటి సినిమా ‘సలామ్ బాంబే’. చిత్ర రంగంలో ఆయన చేసిన కృషికి ప్రతిఫలంగా భారత ప్రభుత్వం 2011లో పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. 'పాన్ సింగ్ తోమర్' సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న ఇర్ఫాన్, చివరిగా 'అంగ్రేజీ మీడియం' అనే సినిమాలో నటించాడు. తెలుగులో కూడా ఈయన మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో నటించారు.