సుఖోయ్ యుద్ధవిమానాలకు బ్రహ్మోస్
Posted On January 21, 2020
*హిందూ మహా సముద్ర జలాలపై పట్టు సాధించేందుకు తంజావూరు బేస్ స్టేషన్‌గా భారత వాయు సేన (ఐఏఎఫ్) బ్రహ్మోస్ క్షిపణులను అమర్చిన సుఖోయ్ యుద్ధవిమానాలను ప్రారంభించింది.
* ఐఏఎఫ్ ప్రకారం, టైగర్‌షార్క్ 222 స్క్వాడ్రన్‌కు చెందిన సుఖోయ్30 ఎంకేఐ యుద్ధ విమానాలు దక్షిణ భారత జలాలపై ఆధిపత్యం సాధిస్తాయి.
* దక్షిణ భారత్‌లో తంజావూర్ వ్యూహాత్మక స్థావరంగా మారనుంది.
*చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ --భారత్-రష్యాల సంయుక్త కృషితో తయారైన బ్రహ్మోస్ క్షిపణులకు సుఖోయ్‌లు తోడై అత్యంత శక్తిమంతంగా మారాయి.ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ 300 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఈ క్షిపణులు సులువుగా టార్గెట్ చేయగలవు.
*ఈ విమానాలు ఒక్కసారి ఇంధనం నింపుకుంటే 1500 కిలోమీటర్ల పరిధిలో నిరంతరాయంగా పనిచేసే సామర్థ్యం వీటి సొంతం.