వేతనాల కోడ్ బిల్లుకు కేబినెట్ ఆమోదం
Posted On July 05, 2019
* ప్రస్తుతం కార్మికులు, ఉద్యోగుల వేతనాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న
వేతనాల చెల్లింపు చట్టం-1936,
కనీస వేతన చట్టం-1948,
బోనస్ చెల్లింపు చట్టం-1965,
సమాన వేతన చట్టం-1976లను రద్దుచేసి వేతనాల కోడ్ చట్టాన్ని తీసుకొస్తారు.
* బిల్లు చట్టరూపం దాల్చితే కార్మికులు, ఉద్యోగుల కనీస వేతనంపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుంది.
* దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సులభతర వాణిజ్యంలో భారత్ స్థానం మెరుగై విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడం వీలవుతుంది.
* బిల్లు ప్రకారం రైల్వేలు, గనులుసహా కొన్ని విభాగాల్లో అందించే వేతనాలను కేంద్రం ఖరారు చేస్తుంది.
* మిగిలిన రంగాల్లో వేతనాలను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి.
* ఈ కనీస వేతనాలను ప్రతి ఐదేళ్లకోసారి సమీక్షిస్తామన్నారు.