తూత్తుకుడి లో చమురు శుద్ధి కేంద్రం
Posted On January 21, 2020
*తూత్తుకుడి రూ.40 వేల కోట్ల వ్యయంతో ముడిచమురు శుద్ధీకరణ కేంద్రం నెలకొల్పేందుకు రాష్ట్ర మంత్రి వర్గం అంగీకరించిది.అల్‌కెరాఫీ సంస్థ ఆధ్వర్యంలో కొత్త చమురు శుద్ధీకరణ కేంద్రం నెలకొల్పేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
* అదే విధంగా శ్రీపెరుంబుదూరులో చైనాకు చెందిన వింటెక్ ఎలక్ట్రికల్ వాహనాల తయారీ కర్మాగారం ఏర్పాటు చేయడానికి కూడా మంత్రివర్గం అంగీకరించిది.
*దక్షిణాది జిల్లాల్లో కొత్త ఆరు పరిశ్రమలను ప్రారంభించడానికి కూడా మంత్రివర్గం అంగీకరించింది.
*'హైడ్రోకార్బన్' పథకం-
*కేంద్రం నిర్ణయం--హైడ్రోకార్బన్ పథకానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతి పొందాల్సిన అవసరం లేదని, ప్రజల అభిప్రాయాలు కోరాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రకటించింది.
*తమిళనాడు డిమాండ్ --
హైడ్రోకార్బన్ బావులు ఏర్పాటు చేసేందుకు సంబంధిత సంస్థ కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతి పొందాలి. ఆ ప్రాంతానికి చెందిన ప్రజల అభిప్రాయాలు కోరాలి.
ఈ పథకంతో కావేరి పీఠభూమి ప్రాంతంలో ప్రజల జీవనాధారం దెబ్బతింటుంది. సముద్రతీర జిల్లాల్లో హైడ్రోకార్బన్ ప్రాజెక్టులను అమలు చేస్తే తమిళ రైతులు తీవ్రంగా నష్ట పోతారు.
హైడ్రోకార్బన్ ప్రాజెక్టులను అమలు చేయదలచిన ప్రాంతాల్లో తప్పనిసరిగా ప్రజాభిప్రాయసేకరణ చేపట్టాలి.