2020 అక్టోబర్ వరకు ఆర్థిక సంఘం గడువు పొడగింపు
Posted On November 28, 2019
*కేంద్ర-రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీపై సిఫార్సులు చేయడానికి ఉద్దేశించిన 15వ ఆర్థిక సంఘం కాలపరిమితిని ఏడాది పాటు పెంచుతూ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది.
* దీని ప్రకారం ఈ సంఘం వచ్చే ఏడాది అక్టోబరు 30న నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
*2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 వరకు నిధుల పంపిణీ, తదితర విషయాలను పరిశీలించి సూచనలు చేయాల్సి ఉంటుంది.
*ఈ సంఘం 2020-21 నుంచి 2024-25 వరకు ఆర్థిక అంశాలను పరిశీలించి గత అక్టోబర్ 30న నివేదిక సమర్పించాల్సి ఉంది.
*తరువాత గడువును నవంబర్ 30వరకు పెంచారు.
*లోక్‌సభ ఎన్నికల కారణంగా సంఘం సభ్యులు రాష్ట్రాల పర్యటనను పూర్తి చేయలేకపోవడం, జమ్మూ-కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత నిధుల బదిలీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు తగిన మార్గదర్శకాలను ఇవ్వకపోవడంతో గడువు పెంచారు.
* బడ్జెట్ రూపకల్పనకు వీలు కలిగించేలా కేవలం 2020-21 ఆర్థిక సంవత్సరం కోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల పంపిణీపై మధ్యంతర నివేదిక సమర్పించే అవకాశం ఉంది.
*ఆర్థిక సంఘం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి లేదా అవసరమని భావించినపుడు రాష్ట్రపతి దీనిని ఏర్పాటు చేస్తారు.
*ఆర్థిక సంఘం లో ఒక చైర్మన్ నలుగురు సభ్యులు ఉంటారు.
*కేంద్ర రాష్ట్రాల మధ్య విభజించదగిన పన్నుల నికర రాబడులను కేంద్ర రాష్ట్రాల మధ్య విభజించడం మరియు రాష్ట్రాల మధ్య వారి వారి వాటాలను కేటాయించడం ఈ సంఘం చేస్తుంది.
* కేంద్ర సంచిత నిధి నుండి రాష్ట్రాలకు రెవెన్యూ grant in aid grant-in-aid మంజూరు చేయడానికి వర్తించు మార్గదర్శక సూత్రాలు రూపొందిస్తుంది.
*15వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు NK సింగ్