వింబుల్డన్ రద్దు
Posted On April 02, 2020
*పురాతనమైన గ్రాండ్‌స్లామ్‌ల్లో ఒకటిగా ఖ్యాతిగాంచిన వింబుల్డన్ టెన్నిస్ టోర్నీని కొవిడ్-19 కారణంగా రద్దుచేసారు.
*దీంతో 75 ఏళ్ల (చివరిసారి 1945లో) తర్వాత తొలిసారిగా ఈ టోర్నీజరగడం లేదు.
* జూన్ 29 నుంచి జూలై 12 వరకు ఈ ఆల్ ఇంగ్లండ్ క్లబ్ టోర్నీ జరగాలి.
* తదుపరి టోర్నీ 2021 జూన్ 28 నుంచి జూలై 11 వరకు జరగనున్నట్టు వెల్లడించారు.
*143 ఏళ్ల క్రితం అంటే...1877లో ప్రారంభమైన వింబుల్డన్‌ను ఇప్పటివరకు పదిసార్లు మినహా నిరాటంకంగా నిర్వహిస్తున్నారు.
*మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా 1915 నుంచి 1918 వరకు (4 సార్లు), రెండో ప్రపంచ యుద్ధం వల్ల 1940 నుంచి 1945 వరకు (6 సార్లు) జరపలేదు.
*కరోనా వైరస్‌తో ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్‌లను కూడ వాయిదా వేశారు