పురుషుల దళానికి మహిళా నాయకత్వం
Posted On January 19, 2020
*కెప్టెన్ తానియా షెర్గిల్,ఆర్మీ అధికారిగా ఈమె అరుదైన గౌరవం దక్కించుకున్నారు.
*న్యూఢిల్లీలో జనవరి 16వ తేదీన నిర్వహించిన ఆర్మీ డే పరేడ్‌లో పురుషుల దళానికి ఆమె నేతృత్వం వహించారు.
*ఆర్మీ డే పరేడ్‌లో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా ఆమె రికార్డుకెక్కారు.
* గత ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కెప్టెన్ భావనా కస్తూరి అనే ఆర్మీ అధికారి, పురుషుల ఆర్మీ బృందానికి నేతృత్వం వహించారు.