3 గ్రామ పంచాయతీలకు జాతీయస్థాయి పురస్కారాలు
Posted On April 25, 2020
* తెలంగాణ రాష్ట్రంలోని మూడు గ్రామ పంచాయతీలకు వివిధ కేటగిరీల్లో జాతీయస్థాయి పురస్కారాలు లభించాయి.
* గ్రామ పంచాయత్ డెవలప్‌మెంట్ ప్లాన్ అవార్డు(జీపీడీపీఏ) 2018-19 సంవత్సరానికి గాను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామానికి దక్కింది.
* పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆదివారంపేట గ్రామం గౌరవ గ్రామసభ,
* కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తుల్లాపూర్ గ్రామం పిల్లల స్నేహపూర్వక (చైల్డ్ ఫ్రెండ్లీ) విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకున్నాయి.
* రాష్ట్రం నుంచి మొత్తం 7 కేటగిరీల్లో ప్రతిపాదనలు పంపగా.. కేంద్రం ఇప్పటివరకు ప్రకటించిన మూడు విభాగాల్లోనూ రాష్ట్రానికి పురస్కారాలు లభించాయి.