కృష్ణారావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు
Posted On January 29, 2019
- జమ్ము కశ్మీర్‌కు చెందిన ప్రముఖ డోగ్రీ కవయిత్రి పద్మశ్రీ పద్మా సచ్‌దేవ్ రాసిన కవితను ‘‘గుప్పెడు సూర్యుడు.. మరికొన్ని కవితలు’’ పేరిట తెలుగులోకి అనువదించినందుకు ఆయన ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
- దేశ విభజన సమయంలో తండ్రిని పోగొట్టుకున్న కవయిత్రి తాను ఎదుర్కొన్న మానసిక వేదన, భారతీయ స్త్రీ ఎదుర్కొనే సామాజిక ఇబ్బందులు, సుఖదుఃఖాలను తన కవితల్లో చిత్రీకరించగా.. కృష్ణారావు వాటిని తెలుగులోకి అద్భుతంగా అనువదించారని ప్రశంసాపత్రంలో కొనియాడారు.
- డోగ్రీ భాషలోని ఈ కవితలను కేంద్ర మాజీ మంత్రి కరణ్‌సింగ్ ఇంగ్లిషులోకి తర్జుమా చేయగా.. కృష్ణారావు తెలుగులోకి అనువదించారు. కృష్ణారావుకు పురస్కారం కింద రూ.50 వేల నగదు, ప్రశంసపత్రం అందజేయనున్నారు.
- కృష్ణారావు 1962లో మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం వింజమూరు గ్రామంలో జన్మించారు.