భద్రత పై కేంద్రం ముందుకు
Posted On January 19, 2020
*ప్రజా రవాణా వాహనాల్లో మహిళలు, చిన్నారుల భద్రతకు ఉద్దేశించిన పర్యవేక్షణ కేంద్రాల ఏర్పాటులో రాష్ట్రాలు తగినంత పురోగతి సాధించలేదని కేంద్రం పేర్కొంది.
*వీటిని త్వరితగతిన నెలకొల్పేందుకు తోడ్పాటు అందించడానికి కేంద్రం ముందుకు వచ్చింది.
*ఇందుకు ఫిబ్రవరి 15లోగా తమకు సమాచారమివ్వాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది.
* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, రవాణా కమిషనర్లకు కేంద్రం లేఖలు రాసింది.
*2019, జనవరి 1, ఆ తర్వాతి నుంచి నమోదైన వాహనాలన్నింటికీ వాహనాల ట్రాకింగ్ వ్యవస్థలను, అత్యవసర మీటలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
*వీటి ద్వారా వాహనాల రాకపోకలను పర్యవేక్షించేందుకు సుమారు రూ.463.90 కోట్లతో పర్యవేక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావించింది.