రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం
Posted On December 17, 2019
*దేశంలోని రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారాన్ని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ శాఖ నిధులను విడుదల చేసింది.
*రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుమారు 35 వేల 298 కోట్ల పరిహారాన్ని రిలీజ్ చేశారు.
* రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీకి జీఎస్టీ పన్ను బకాయిలను విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణకు రూ.1036 కోట్ల జీఎస్టీ బకాయిలు విడుదల అయ్యాయి.
*ఆగస్టు నుంచి పరిహారం చెల్లించకపోవడం పట్ల రాష్ట్రాలు అసహనం వ్యక్తం చేశాయి.
* జీఎస్టీ అమలు తర్వాత కలిగే రెవెన్యూ లోటును ఐదేళ్ల పాటు రాష్ట్రాలకు కేంద్రం భర్తీ చేయాలని జీఎస్టీ చట్టం చెబుతోంది. 2017, జులై1వ తేదీన జీఎస్ టీ అమల్లోకి వచ్చింది.
*పరిహారం రెండు నెలల్లోపు రాష్ట్రాలకు చెల్లించాల్సివుండగా ఈ ఏడాది ఆగస్టు నెలకు సంబంధించిన పరిహారం ఇంత ఆలస్యం అయింది.