3.3 శాతం ప్రపంచ వృద్ధిరేటు
Posted On January 22, 2020
*అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంతర్జాతీయ వృద్ధి రేటు అంచనాలను తగ్గిస్తూ వస్తోంది.
*ఐఎంఎఫ్ వార్షిక నివేదికలోని అంశాలు --
2019లో 2.9 శాతం వున్న ప్రపంచ ఆర్థికాభివృద్ధి 2020లో 3.3 శాతానికి, 2021లో 3.4 శాతం వుంటుందని అంచనా వేయగా, ఈ అంచనాలో 0.1 శాతం మేర తగ్గించింది.
ముఖ్యమైన కారణాలుగా,వాణిజ్య విధానాల అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వర్ధమాన ఆర్థిక వ్యవస్థల మార్కెట్లలో వ్యక్తిగత వత్తిడిలను పేర్కొంది.
2019 ద్వితీయార్ధం నుండి వస్తువుల తయారీ, వాణిజ్య రంగాలలో కొనసాగుతున్న అనిశ్చితి ఆధారంగా అంచనాలను తగ్గించింది.
*ఆర్థికాభివృద్ధికి సవాళ్ళు --పెరుగుతున్న సామాజిక అశాంతి, కరీబియన్ దేశాలలో హరికేన్‌లు, ఆస్ట్రేలియాలో కార్చిచ్చులు, తూర్పు ఆఫ్రికాలో వరదలు, దక్షిణాఫ్రికాలో కరువు ఇటీవల సవాళ్ళుగా ఎదురయ్యాయి.