ముగిసిన సుదీర్ఘ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 25
Posted On December 17, 2019
*కీలక అంశాలపై ఎలాంటి ఒప్పందం లేకుండానే ఐరాస వాతావరణ సదస్సు (కాప్-25) ముగిసింది.
* ఒప్పందం కుదరకుండా ధనిక దేశాలే అడ్డుకున్నాయని పేద దేశాలు విమర్శించాయి.
*కార్బన్ మార్కెట్ యంత్రాంగానికి సంబంధించిన 2015 పారిస్ ఒప్పందంలోని ఆరవ అధికరణపై ఆదివారం సుదీర్ఘ చర్చలు జరిపినప్పటికీ ఒక అంగీకారానికి రావటంలో విఫలమయ్యాయి.
*ఈ చర్చలు డిసెంబర్ 13వ తేదీన ముగియాల్సి ఉన్నడిసెంబర్ 17వ తేదీ వరకూ 40 గంటల సేపు కొనసాగాయి.
*ఇప్పటి వరకూ జరిగిన కాప్ సదస్సుల చరిత్రలో అత్యధిక సమయం తీసుకున్న సదస్సు ఇదే.
*రెండు వారాలుగా సాగిన ఈ చర్చల్లో పాల్గొన్న దాదాపు 200కు పైగా దేశాలు ప్రధానంగా పారిస్ ఒప్పందంలోని ఆర్టికల్ 6పైనే కేంద్రీకరించాయి.
*ఆర్టికల్ 6పై ఒక అవగాహనకు రావటంలో విఫలం అయ్యాయి.
* ఈ అంశంపై వచ్చే ఏడాది గ్లాస్గోలో జరిగే కాప్26లో మరింత విస్తృతంగా చర్చించాలని నిర్ణయించారు.
*వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో ధనిక దేశాలకు, పేద, వర్థమాన దేశాలకు మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి.
* వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో విస్తృత స్థాయి లక్ష్యాలను నిర్దేశించాలని కొన్ని దేశాలు వాదించగా, మరికొన్ని దేశాలు మాత్రం పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలకే తాము కట్టుబడి వుంటామని స్పష్టం చేశాయి.
*2020 ముందు కాలంలో సాధించాల్సిన లక్ష్యాలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఆయా దేశాల ప్రతినిధి బృందాలు సమీక్షించాయి. వాతావరణ మార్పులను ఎదుర్కోవటం, ఇందుకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక పరమైన అంశాల బదిలీ, సామర్ధ్య పెంపుదల వంటి అంశాలపై ఈ దేశాలు చర్చించాయి.
* భూగోళ ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు కర్బన ఉద్గారాల్లో మరింతగా కోతలు పెట్టాలని, ఈ పని తక్షణమే జరగాలని పేద దేశాలు కోరాయి.
*కాప్-25 సదస్సు ఆమోదించిన డిక్లరేషన్ కర్బ న ఉద్గారాల తగ్గింపు పై ఎలాంటి ఒప్పందం కుదరలేదు.
* ఈ సదస్సు ఆమోదించిన పత్రాల్లో 'చిలీ-మాడ్రిడ్ టైమ్ ఫర్ యాక్షన్' ఒప్పందం ఒకటి.
* 2020 నాటికల్లా వాతావరణ అత్యయిక పరిస్థితి (క్లైమేట్ ఎమర్జన్సీ)ని ఎదుర్కొనేందుకు వివిధ దేశాలు దేశీయంగా నిర్దేశించుకున్న లక్ష్యాలు (ఎన్‌డిసి) సాధనకు అవసరమైన భూమికను ఇది సిద్ధం చేస్తుంది.
* పారిస్ ఒప్పందంలో ఇచ్చిన హామీలకు, వాస్తవిక పరిస్థితికి చాలా తేడా ఉంది.
* భూగోళం ఉష్టోగ్రతలు 1.5 డిగ్రీల సెల్షియస్‌కు మించి పెరగకుండా చూడడం ప్రపంచం ముందున్న ఓ పెద్ద సవాల్.
* దీనిని ఎదుర్కొనేందుకు పారిస్ ఒప్పందాన్ని తు.చ తప్పక అమలు చేయాల్సిన అవసరముంది. కానీ, మాడ్రిడ్ సదస్సులో సంపన్న దేశాలు దీనికి భిన్నంగా వ్యవహరించాయి.
* చిలీలో నిర్వహించాల్సిన ఐరాస వాతావరణ సదస్సు అక్కడ నెలకొన్న రాజకీయ కల్లోల పరిస్థితుల దృష్ట్యా చివరి నిమిషంలో వేదికను స్పెయిన్‌కు మార్చారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో పన్నెండు రోజుల పాటు జరిగిన కాప్-25 సదస్సుకు 26 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు.