రాజీ తో ముగిసిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 25
Posted On December 16, 2019
*ఐక్యరాజ్యసమితి మాడ్రిడ్‌లో నిర్వహించిన వాతావరణ పరిరక్షణ సదస్సులో సుదీర్ఘంగా సాగిన చర్చలు రాజీ ఒప్పందంతో ముగిశాయి.
*కర్బన ఉద్గారాలను తగ్గించడంలో ప్రపంచ దేశాల స్పందనను మెరుగుపరచడమే కీలక అంశం మీద సదస్సులోని ప్రతినిధులు ఒక ఒప్పందానికి వచ్చారు.
*వచ్చే ఏడాది గ్లాస్గోలో జరుగనున్న ప్రధాన సదస్సులో అన్ని దేశాలూ వాతావరణ పరిరక్షణ కోసం తాము తీసుకున్న కొత్త తీర్మానాలను సమర్పించాల్సి ఉంటుంది.
*కర్బన మార్కెట్లు సహా ఇతర సమస్యల మీద విభేదాలు తదుపరి సమావేశం వరకూ వాయిదా పడ్డాయి.
*చర్చల్లో పాల్గొన్న ప్రతినిధులు చివరికి, వచ్చే ఏడాది గ్లాస్గో సదస్సు సమయంకల్లా కర్బన ఉద్గారాలను తగ్గించటానికి సంబంధించి, సరికొత్త, మెరుగైన ప్రణాళికలను సిద్ధం చేయాలనే ఒప్పందానికి వచ్చారు.
*అధిక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలంటూ యూరోపియన్ యూనియన్, చిన్న దీవి దేశాల మద్దతుతో ముందుకు తెచ్చిన ప్రతిపాదనను అమెరికా, బ్రెజిల్, ఇండియా, చైనా సహా పలు దేశాలు వ్యతిరేకించాయి.
*అయితే, 2020కి ముందు సంవత్సరాల్లో వాతావరణ మార్పు మీద తమ హామీలను నిలబెట్టుకున్నామని సంపన్న దేశాలు నివేదికలు ఇవ్వాలన్న షరతుతో ఈ రాజీ ఒప్పందం కుదిరింది.
*వచ్చే ఏడాది భారీ వాతావరణ సదస్సు స్కాట్లండ్‌లోని గ్లాస్గోలో జరుగుతుంది.
*వరల్డ్ మెటిరియోలాజికల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎంఓ) చెప్తున్న దాని ప్రకారం.. ప్రపంచం.. పారిశ్రామికీకరణ విస్తరించటానికన్నా ముందు నాటికన్నా ఇప్పుడు ఒక డిగ్రీ సెల్సియస్ ఎక్కువ వేడిగా ఉంది.
*ఇప్పటివరకూ, అత్యంత ఉష్ణతాపం కలిగిన 20 సంవత్సరాలు... గత 22 ఏళ్ళలోనే నమోదయ్యాయి. అందులోనూ, 2015 నుంచి 2018 వరకూ నాలుగు సంవత్సరాలు ఆ జాబితాలో అగ్రభాగాన నిలిచాయి.
*వాతావరణం వేడెక్కుతున్న ప్రస్తుత పోకడ కొనసాగితే ఈ శతాబ్దం ముగిసేనాటికి వాతావరణాలు 3 నుంచి 5 సెంటీగ్రేడ్స్ మధ్య పెరగవచ్చునని డబ్ల్యూఎంఓ చెబుతోంది.
*ఈ ఉష్ణోగ్రత పెరుగుదల 2 సెంటీగ్రేడ్స్ దాటితే.. భూతాపం ప్రమాదకరంగా పరిణమిస్తుందని పరిగణించారు.
* భూతాపం పెరుగుదల 1.5 సెంటీగ్రేడ్స్ లోపే పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని సాధించాలంటే, ''సమాజంలోని అన్ని రంగాల్లో వేగవంతమైన, సమూలమైన, అసాధారణమైన మార్పులు అవసరం'' అని 2018లో ఐపీసీసీ నివేదిక పేర్కొంది.