వందే భారత్ మిషన్ ప్రారంభం
Posted On May 09, 2020
‘వందే భారత్ మిషన్’ కార్యక్రమం ద్వారా లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం
మే 7న మొదటి విడతగా రెండు విమానాల్లో యూఏఈ నుంచి 363 మంది భారతీయులు కేరళకు చేరుకున్నారు. అబుదాబి నుంచి నలుగురు శిశువులు, 177 మంది ప్రయాణికులతో కూడిన ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కోచి విమానాశ్రయానికి చేరుకుంది. వీరందరినీ క్వారంటైన్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.