మాడపాటి సత్యవతి మృతి
Posted On March 05, 2020
*రేడియోలో వార్తలు చదువుతూ, శ్రోతల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మాడపాటి సత్యవతి(80) కన్నుమూశారు.
*హైదరాబాద్ నగర మొదటి మేయర్ మాడపాటి హనుమంతరావు మనువరాలైన సత్యవతి, హైదరాబాద్ లో జన్మించింది.
*తెలుగు చదువుకోవడంపై నిషేధం ఉన్న కాలంలోనే హనుమంతరావు స్థాపించిన తెలుగు బాలికల ఉన్నత పాఠశాలలో సత్యవతి చదువుకుంది.
* ఆకాశవాణిలో తొలిసారి వార్తలు చదివిన మహిళ,2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.