మానస సరోవర్ యాత్రకు కీలకమైన రహదారిని ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
Posted On May 09, 2020
మానస సరోవర్ యాత్రకు 80 కిలోమీటర్ల పొడవైన లింక్ రహదారిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల ప్రారంభించారు. సముద్ర మట్టానికి 17వేల అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ రహదారి కారణంగా కైలాస్-మాన్‌సరోవర్ వెళ్లడానికి మార్గం సుగమమయింది.ఈ రహదారి ఉత్తరాఖండ్‌లోని ధార్చుల నుండి చైనా బోర్డర్‌లోని లిపులెక్ వరకు ప్రారంభమవుతుంది. లిపులేఖ్ కనుమ నుంచి మాన్‌సరోవర్ కేవలం 90 కి.మీ.దూరంలో ఉండడం గమనార్హం. ఈ మార్గంలో మాన్‌సరోవర్ యాత్రకు ఇంతవరకు మూడు వారాల సమయం పడుతుండగా, ఈ రహదారి కారణంగా వారంలోనే ముగించే అవకాశం ఉంది. సైనిక బలగాలను వేగంగా తరలించడానికీ వీలు కలిగింది