రక్షణ బలోపేతం
Posted On January 22, 2020
*దేశ రక్షణ విభాగంలో శక్తి సామర్ధ్యాలను పెంపొందించేందుకు భారత నౌకాదళ విభాగం ప్రయత్నిస్తుంది.
*చేపట్టే చర్యలు --
రూ.50వేల కోట్లతో దేశీయంగా ఆరు జలాంతర్గాములను నిర్మించేందుకు భారత్‌కు చెందిన 2 నౌకా నిర్మాణ సంస్థలను, 5 విదేశీ ఆయుధ తయారీ దిగ్గజాలను ఎంపిక చేసింది.
పీ75ఐ అనే ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ రంగంలోని మజ్గావ్ డాక్స్ లిమిటెడ్ (ఎండీఎల్), ఎల్ అండ్ టీ సంస్థలను రక్షణ శాఖ ఎంపిక చేసింది.
రూ.5,100 కోట్లతో దేశీయంగా సైనిక సామగ్రిని సమకూర్చుకోవడానికి ఆమోదం తెలిపింది.
స్వదేశీ పరిజ్ఞానంతో ఆధునికీకరించిన సారంగ్ శతఘ్నులను మార్చి 31 నాటికి సైన్యంలో ప్రవేశపెట్టనున్నారు.