వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం
Posted On January 07, 2020
*ఢిల్లీ ఎన్నికల్లో వృద్ధుల కోసం ఈసీ ప్రత్యేక సౌకర్యం కల్పించింది.
*80 ఏళ్ల పైబడిన వృద్ధులతోపాటు దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు.
* ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకుంటే నోటిఫికేషన్ జారీ అయిన ఐదు రోజుల్లో పేర్లను నమోదు చేసుకోవాలి.
* ఈ విధానాన్ని జార్ఖండ్ ఎన్నికల్లో 7 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయగా, ఢిల్లీలో మొత్తం 70 నియోజకవర్గాల్లో అమలు చేస్తున్నారు.