దొడ్డి కొమురయ్య(డీకే) తొలి అమరత్వానికి నేటికి 73 ఏళ్లు
Posted On July 05, 2019
* 1927లో వరంగల్లు జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో సాధారణ గొర్రెల పెంపకందార్ల కుటుంబములో జన్మించాడు.
* ఇతని అన్న దొడ్డి మల్లయ్య కమ్యూనిస్టు పార్టీ గ్రామ నాయకుడు.
*నిజాం సర్కారు హయాంలో విస్నూర్ కేంద్రంగా దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి అరవై గ్రామాలపై ఆదిపత్యం నడుస్తోంది.
* ఈ క్రమంలోనే ఆంధ్ర మహాసభ సంఘ సందేశంతో నల్లా నర్సింహ్ములు, చకిల యాదగిరి, మందడి మోహన్‌రెడ్డి తదితరుల హయాంలో గుతపల(కర్ర)సంఘం ఏర్పర్చారు.
* 1947 జూలై 4వ తేదీన గుండాలు విచక్షణ రహితంగా తుపాకీతో కాల్చగా దొడ్డి కొమురయ్య వీర మరణం పొందారు.
* కొమురయ్య తొలి అమరత్వంతో రక్తానికి రక్తం... ప్రాణానికి ప్రాణం.. అనే నినాదంతో సాయుధ పోరాటంగా మల్చుకొని ప్రపంచ చరిత్ర పుటల్లోకెక్కింది.
* నిజాం కాలంలో వెలుగొందుతున్న మీజాన్ పత్రికలో విస్నూర్ దొరల విజృంభణ, ఆంధ్ర మహాసభ కార్యకర్త ‘దొడ్డి కొమురయ్య హతం’ అనే వార్తా కథనం తొలి అమరత్వానికి చారిత్రాత్మకంగా నిలిచింది.