Telugu Current Affairs: తెలుగు కరెంట్ అఫైర్స్ - 2020

కృష్ణా తీరంలో  క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటు



ls-img * నాగాయలంక మండలం గుల్లలమోద ప్రాంతాన్ని పరీక్షా కేంద్రానికి అనువైనదిగా గుర్తించారు. 
* ఇక్కడికి రావడం వల్ల స్థానికంగా మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయి. ఎటువంటి అభివృద్ధికి నోచుకోని ఈ ప్రాంతం ప్రగతి పథంలో నడవనుంది.
*  భారీ కంటైనర్లు వచ్చేందుకు వీలుగా రహదారులను విస్తరించనున్నారు. నిర్మాణాలు ప్రారంభమైతే స్థానికులకూ పెద్ద ఎత్తున పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.
*  సుమారు 300 మంది శాస్త్రవేత్తలు, సిబ్బంది నివాసం ఉండనున్నారు. దీని వల్ల ఈ ప్రాంతం ఆర్థికంగా వృద్ధి చెందుతుంది.  386 ఎకరాలలో అవసరమైనంత మేరకే స్థలాన్ని వినియోగించుకోనున్నారు. మిగిలిన ప్రాంతలో పచ్చదనానికి పెద్ద పీట వేయనున్నారు. దీని వల్ల తీర ప్రాంతం హరితమయం కానుంది. సమీపంలోని పల్లెల్లో మౌలిక వసతులు మెరుగుపడనున్నాయి.
* ఇక్కడి అటవీ ప్రాంతంలో అనేక జంతుజాలం మనుగడ సాగిస్తోంది. వన్యప్రాణి చట్టంలోని షెడ్యూల్‌ ఒకటిలో బావురు పిల్లి, ఆలివ్‌ రిడ్లీ తాబేలును చేర్చారు. దీంతో మడ అడవుల్లోని జీవావరణô, అంతరించిపోతున్న జంతువుల మనుగడకు ముప్పు వాటిల్లకుండా నిర్మాణాలు చేపట్టాలి.
* సంబంధిత డివిజనల్‌ అటవీశాఖ అధికారి కూడా ఏటా తనిఖీ చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వాలి. బదలాయించనున్న అటవీ భూమికి రెండు రెట్లు అధిక ప్రాంతాన్ని అటవీ శాఖకు ఇవ్వాలి.
* రెండో దశ అనుమతి వచ్చినప్పటి నుంచి మూడేళ్లలో ఈ భూభాగాన్ని పచ్చదనంతో నింపేయాలి. అభయారణ్య పరిధిలో కేవలం పగటి పూట మాత్రమే తమ కార్యకలాపాలను సాగించాలి. రాత్రి పూట పూర్తిగా ఆపేయాల్సి ఉంటుంది.
* ఆలివ్‌ రిడ్లీ తాబేలు గుడ్లు పెట్టే జనవరి నుంచి మే నెలల మధ్య సమయంలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదు. ఈ ప్రాంతంలో అధిక శక్తిగల దీపాలను బిగిస్తే జంతువుల సంచారానికి ఇబ్బంది కలుగుతుంది. కనక పరిమితంగా వినియోగించాల్సి ఉంది.
* పరీక్షా కేంద్రం వద్దకు సామగ్రిని చేరవేసేందుకు రోడ్డుకు బదులు కృష్ణా జలాల్లో పడవుల ద్వారా రవాణా చేసే అవకాశాలను పరిశీలించాలి. ఈ అనుసంధాన మార్గం కొద్ది ఎత్తులో నిర్మిస్తే అలల ప్రవాహానికి అడ్డురాకుండా ఉంటుంది. నిర్మాణానికి పోను మిగిలిన ప్రాంతంలో మడ అడవులను విస్తారంగా పెంచాలి.
* 2011 -  బాలాసోర్‌ కంటే మెరుగైన సదుపాయాలతో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం.
* 2012 - అనేక ప్రాంతాలను పరిశీలించిన మీదట గుల్లలమోద అనుకూలమైనదిగా తేల్చారు. ఇందుకు 386 ఎకరాలను గుర్తించారు.
* 2017 - రక్షణ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు. రెవెన్యూ ఆధీనంలోని 321 ఎకరాలకు, అభయారణ్యంలోని భూములకు కలిపి మొత్తం రూ.35కోట్లు చెల్లించారు.
* 2017 -  తొలి దశ అనుమతి లభించింది.
* 2018 - ఈ ప్రాంతాన్ని సీఆర్‌జడ్‌ నుంచి మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజెట్‌ ప్రచురించింది.
* 2019 - రెండో దశకు అనుమతుల మంజూరు.
Related Articles

Telugu Current Affairs e-Magazine

Current affairs Telugu updates here by our dedicated team daily basis. Use filter option to find Telugu current affairs by date, category, regional. You also find Telugu Current Affairs bitbanks, detailed articles for essay writing, Monthly Current affairs online tests in one place. Vyoma Telugu Current affairs is a crucial component for competitive exam and we committed to giving the best quality current affairs material. Vyoma provides Telugu Current Affairs Monthly Pdf e-magazine.

Telugu Current Affairs Online Exams

Current affairs Telugu updates here by our dedicated team daily basis. Use filter option to find Telugu current affairs by date, category, regional. You also find Telugu Current Affairs bitbanks, detailed articles for essay writing, Monthly Current affairs online tests in one place. Vyoma Telugu Current affairs is a crucial component for competitive exam and we committed to giving the best quality current affairs material. Vyoma provides Telugu Current Affairs Monthly Pdf e-magazine.

  • January-20 CA COMBO-T/M
  • Current Affairs COMBO
  • 200 ప్రశ్నల 2 కరెంట్ అఫైర్స్ ప్యాకేజీ రూ 60/- మాత్రమే
  • Total Exams - 2
  • Total Questions - 200
  • Price - Rs. 90   ₹60
  • DETAILS REGISTER
  • JAN-20 CA TEST-1 T/M
  • January 2020 Current Affairs Level 1
  • 100 ప్రశ్నల కరెంట్ అఫైర్స్ ప్యాకేజీ కేవలం రూ 30/- మాత్రమే
  • Total Exams - 1
  • Total Questions - 100
  • Price -   ₹30
  • DETAILS REGISTER
  • JAN-20 CA TEST-2 T/M
  • January 2020 Current Affairs Level 2
  • 100 ప్రశ్నల కరెంట్ అఫైర్స్ ప్యాకేజీ కేవలం రూ 30/- మాత్రమే
  • Total Exams - 1
  • Total Questions - 100
  • Price -   ₹30
  • DETAILS REGISTER

Download Mobile APP

Andhra Pradesh Grama Sachivalayam | Vyoma Exams Preparation App