ఈ –లెర్నింగ్ యాప్ అభ్యాస ఆవిష్కరణ
Posted On April 25, 2020
కరోనా లాక్‍డౌన్ సమయంలో విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఇంట్లోనే ఉంటూ విజ్ఞానాన్ని సముపార్జించుకునేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం విద్యాశాఖ ప్రవేశపెట్టిన ఈ –లెర్నింగ్ యాప్ “అభ్యాస” ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏప్రిల్ 23న సచివాలయంలో ఆవిష్కరించారు.
ఈ –లెర్నింగ్ యాప్ లో ఒకటి నుంచి ఐదో తరగతులకు సంబంధించిన జనరల్ ఇంగ్లీష్, గణితం, భౌతిక, జీవ, సాంఘిక శాస్త్రాల పాఠాల వీడియోలు, ఆన్‌లైన్ పరీక్షలు ఇందులో అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు.