తెలంగాణ రాష్ట్రంలో రీసైక్లింగ్ కేంద్రం
Posted On November 28, 2019
*ఎలక్ట్రానిక్ వ్యర్థాల తొలగింపుకు నగరంలో రీసైక్లింగ్ కేంద్రం ఏర్పాటైంది.
*మహేశ్వరంలోని మంఖాల్ టీఎస్‌ఐఐసీ పారిశ్రామికవాడలో ఎర్థ్‌సెన్స్ అనే సంస్థ తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
* ఈ రీసైక్లింగ్ కేంద్రానికి తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) సైతం లైసెన్స్‌ను జారీచేసింది.
*పీసీబీ ఆథరైజేషన్ పొందిన మొదటి సంస్థ ఎర్థ్‌సెన్స్.
*ఇలాంటి రీసైక్లింగ్ కేంద్రాలు మనదేశంలో ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా, చెన్నై, బెంగళూరు, త్రివేండ్రంలో మాత్రమే ఉండగా, తాజాగా హైదరాబాద్‌లోనూ ఏర్పాటైంది.
* ఈ వ్యర్థాల రీసైక్లింగ్ ప్రక్రియలో మొదటగా వ్యర్థాలను సేకరించి, రవాణా చేసిన వాటిని సెగ్రిగ్రేట్‌గా విభజించి ధ్వంసం చేసిన అనంతరం రీసైక్లింగ్ చేస్తారు.
*ఎలక్ట్రానిక్ ఈ వ్యర్థాలు అంత త్వరగా పాడుకావు. 97 శాతం వ్యర్థాలను రీసైక్లింగ్ చేయగలం. మిగతా 3 శాతం మాత్రమే సేకరించలేని వ్యర్థాలుంటాయి.
*అసంఘటిత రంగంలోనే వ్యర్థాల సేకరణ కొనసాగుతోంది. ర్యాగ్‌పిక్కర్లు.. చెత్తసేకరణ కార్మికులు మాత్రమే వీటిని సేకరిస్తున్నారు. ఈ వ్యర్థాల్లో నుంచి బంగారం దొరుకుతుండటంతో భస్మం చేస్తున్నారు.
*కంప్యూటర్ సీపీయూ మధర్‌బోర్డ్‌లు, సెల్‌ఫోన్లలో సిలికాన్ చిప్పులలో బంగారం లభిస్తుంది. అశాస్త్రీయంగా కాల్చివేస్తుండటంతో వీటి నుంచి కాలుష్యం వెలువడుతోంది.
*సంవత్సరాల వారీగా ఉత్పత్తయ్యే అంచనా.. సంవత్సరం మెట్రిక్ టన్నులు 2016-17 28,749; 2017-18 33,425; 2018-19 37,456 ;2019-20 40,230 ;2020-21 44,945 ;2021-22 50,335 గ్రేటర్‌లో 40వేల మెట్రిక్ టన్నుల ఈ వేస్ట్ ఉంది.
*ఐపీటీఆర్‌ఐ అంచనాల ప్రకారం గ్రేటర్‌లో ప్రతీ ఏటా 40 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పోగవుతున్నాయి.