జనవరి 31న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు
Posted On January 31, 2020
*జనవరి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
*రెండు విడతలుగా సమావే శాలు కొనసాగనున్నాయి. తొలి దశను జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు, రెండో దశను మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహిస్తారు.
*సమావేశాల తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ప్రసంగించారు.
*ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
*రైల్వే పద్దును కూడా వార్షిక పద్దులోనే కలిపి ప్రకటించనున్నారు.
* ఆర్థిక సర్వేను జనవరి 31వ తేదీన ప్రవేశపెట్టారు.