పసుపు-కుంకుమ మూడో విడత నిధుల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
Posted On April 04, 2019* ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున వీటి విడుదలపై ఎలాంటి ప్రచారమూ చేయరాదని షరతు విధించింది.
* ఎలక్ట్రానిక్, ప్రింట్, రేడియో, ఇంటర్నెట్‌లతో పాటు ఇతర ఏ మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేయకూడదని పేర్కొంది.
* పసుపు-కుంకుమ పథకం కింద స్వయం సహాయక సంఘాల సభ్యులు ఒక్కొక్కరికీ రూ.10వేల చొప్పున మూడు విడతల్లో సాయాన్ని అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
* అందులో భాగంగా ఫిబ్రవరిలో మూడు విడతలకు సంబంధించి పోస్టుడేటెడ్ చెక్కులను ఒకేసారి లబ్ధిదారులకు పంపిణీ చేసింది.
* రెండు విడతలకు సంబంధించి రూ.6 వేలు ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యాయి
* మూడో విడత ఏప్రిల్ 5న జమచేయాల్సి ఉండగా..మార్చి 10 నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావటంతో ఆ నిధుల విడుదలపై సందిగ్ధత నెలకొంది దీనికి భారత ఎన్నికల సంఘం నిధుల విడుదలకు అనుమతినిచ్చింది.
*ఫలితంగా త్వరలో 97.8లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.3,900కోట్లు జమకానున్నాయి.
*పసుపు-కుంకుమ- 25th january 2019 ప్రారంభం