Telugu Current Affairs: తెలుగు కరెంట్ అఫైర్స్ - 2020

విశాఖలో ఎలక్ట్రిక్‌ బస్సులు

ls-img ఆకర్షణీయ నగరాల్లో మరిన్ని అదనపు ప్రాజెక్టుల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధమవుతోంది. ఫ్రెంచ్‌ ప్రభుత్వానికి చెందిన ‘ఏజెన్సీ ఫ్రాన్కైస్‌ డెవలప్‌మెంట్‌’(ఏఎఫ్‌డీ) నుంచి కేంద్ర ప్రభుత్వం సాయం తీసుకుంటోంది. ప్రాజెక్టులకు అందించే సాయంలో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం, కేంద్ర ప్రభుత్వం మిగతా 50 శాతం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
విశాఖలో రూ.350 కోట్లతో ప్రతిపాదించే మూడు ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంగీకారం తెలుపుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన మొదటి వంద ఆకర్షణీయ నగరాల్లో విశాఖపట్నం, కాకినాడ, తిరుపతికి చోటు దక్కింది. రెండో విడత జాబితాలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ అమరావతిని కూడా చేర్చింది. మొదటి విడత ఎంపికైన ఒక్కో నగరానికి 2015-16 నుంచి 2019-20 మధ్య రూ.వెయ్యి కోట్లు చొప్పున కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది.
ఇందులో కేంద్రం రూ.500 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.500 కోట్లు సమకూర్చుతోంది. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలో ఇప్పటికే పలు ప్రాజెక్టుల కింద వివిధ పనులు ప్రారంభమయ్యాయి. కార్యక్రమం 2019-20తో పూర్తి కానుండటంతో వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కొత్త ప్రతిపాదనలపై అదనపు సాయం అందించేందుకు ఏఎఫ్‌డీ సాయం తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. విశాఖలో అదనపు ప్రాజెక్టుల నిర్వహణకు మూడు ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లాయి.
వీటిలో రెండు బీఆర్‌టీఎస్‌ కారిడార్లలో ఎలక్ట్రిక్‌ బస్సుల ఏర్పాటు, చారిత్రక ముడసర్లోవ ఉద్యానవనం ఆధునికీకరణ, నగరపాలక సంస్థ పాఠశాలల డిజిటలైజేషన్‌ ప్రధానమైనవి. ఇందుకోసం కేటాయించే నిధుల్లో 50శాతాన్ని తిరిగి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలియజేయడంతో దిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్వహించే ఉన్నతాధికారుల బృందం చర్చించి ఆమోదించనుంది. సమావేశానికి మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) కమిషనర్‌ కూడా హాజరవుతున్నారు. కాకినాడ, తిరుపతిలో అదనపు ప్రాజెక్టులకు నిధులపై సమ్మతి తెలిపే విషయం రాష్ట్రప్రభుత్వ పరిశీలనలో ఉంది.
Related Articles

Telugu Current Affairs e-Magazine

Current affairs Telugu updates here by our dedicated team daily basis. Use filter option to find Telugu current affairs by date, category, regional. You also find Telugu Current Affairs bitbanks, detailed articles for essay writing, Monthly Current affairs online tests in one place. Vyoma Telugu Current affairs is a crucial component for competitive exam and we committed to giving the best quality current affairs material. Vyoma provides Telugu Current Affairs Monthly Pdf e-magazine.

Telugu Current Affairs Online Exams

  • January-20 CA COMBO-T/M
  • Current Affairs COMBO
  • 200 ప్రశ్నల 2 కరెంట్ అఫైర్స్ ప్యాకేజీ రూ 60/- మాత్రమే
  • Total Exams - 2
  • Total Questions - 200
  • Price - Rs. 90   ₹60
  • DETAILS REGISTER
  • JAN-20 CA TEST-1 T/M
  • January 2020 Current Affairs Level 1
  • 100 ప్రశ్నల కరెంట్ అఫైర్స్ ప్యాకేజీ కేవలం రూ 30/- మాత్రమే
  • Total Exams - 1
  • Total Questions - 100
  • Price -   ₹30
  • DETAILS REGISTER
  • JAN-20 CA TEST-2 T/M
  • January 2020 Current Affairs Level 2
  • 100 ప్రశ్నల కరెంట్ అఫైర్స్ ప్యాకేజీ కేవలం రూ 30/- మాత్రమే
  • Total Exams - 1
  • Total Questions - 100
  • Price -   ₹30
  • DETAILS REGISTER

Download Mobile APP

Andhra Pradesh Grama Sachivalayam | Vyoma Exams Preparation App