ట్రాన్స్‌ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ కోసం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు

* ఈ కమిటీ కన్వీనర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ నియమితులయ్యారు.
*ఈ కమిటీలో సభ్యులు సీఎంలు కుమారస్వామి (కర్ణాటక), మనోహర్‌లాల్ కట్టర్ (హరియాణా), పెమాఖండూ (అరుణాచల్‌ప్రదేశ్), విజయ్ రూపాణి (గుజరాత్), యోగి ఆదిత్యనాథ్ (ఉత్తర్‌ప్రదేశ్), కమల్‌నాథ్ (మధ్యప్రదేశ్), కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, నీతి ఆయోగ్‌లో వ్యవసాయ సంబంధ విషయాలు చూసే రమేష్‌చంద్ నియమితులయ్యారు.
*కేంద్రం రూపొందించిన వ్యవసాయ ఉత్పత్తులు, పశుసంపద మార్కెటింగ్ చట్టం- 2017; వ్యవసాయోత్పత్తులు, పశుసంపద- ఒప్పంద సేద్యం, సేవలు చట్టం-2018లను నిర్దిష్ట గడువులోగా రాష్ట్రాలు అమలు చేయడంపై ఈ కమిటీ దృష్టిసారిస్తుంది.
*రెండునెలల్లో నివేదిక సమర్పిస్తుంది.