బ్రెగ్జిట్ ఒప్పందానికి ఈయూ ఆమోదం
Posted On November 26, 2018- లండన్‌లో జరిగిన సమావేశంలో మిగిలిన 27 దేశాల నేతలు వివాదాస్పద బ్రెగ్జిట్ ఉపసంహరణ ఒప్పందంపై సంతకం చేశారు. బ్రిటన్ ఉపసంహరణ ఒప్పందం, భవిష్యత్తు, ఈయూ-యూకే సంబంధాలపై రాజకీయ ప్రకటనకు ఈయూ-27 ఆమోదం తెలిపినట్లు ఐరోపా మండలి అధ్యక్షులు డొనాల్డ్ టస్క్ ట్వీట్ చేశారు.
- స్పెయిన్ తీరంలో ఉండే బ్రిటన్ విదేశీ భూభాగం జిబ్ట్రార్ విషయంలో స్పెయిన్ కొంత అభ్యంతరం వ్యక్తం చేసినా తర్వాత ఉపసంహరించుకోవడంతో అడ్డంకి లేకుండా పోయింది. ఎలాంటి ఓటింగ్ ప్రక్రియ అవసరం లేకుండా ఏకాభిప్రాయంతో ఆమోదం తెలిపారు.